ఇక క్రికెట్ లీగ్స్ కు అజహరుద్దీన్ కు ఎలాంటి సంబంధం లేదు…

అంబుడ్స్ మెన్ ఇచ్చిన నిర్ణయం పై హైకోర్టు ను ఆశ్రయించాము అని హెచ్ సిఏ వైస్ ప్రెసిడెంట్ జాన్ మనోజ్ అన్నారు. అంబుడ్స్ మెన్ నిర్ణయం పై హైకోర్టు స్టే ఇచ్చింది. అంబుడ్స్ మెన్ కు అపెక్స్ కౌన్సిల్ ను రద్దు చేసే అధికారం లేదు. రేపటి నుండి జరిగే క్రికెట్ లీగ్స్ కు అజహరుద్దీన్ కు ఎలాంటి సంబంధం లేదు. లీగ్స్ కు మొత్తం అన్ని ఏర్పాట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేసింది. దీపక్ వర్మ మా అంబుడ్స్ మెన్ కాదు మేము ఎన్నికొలేదు. కక్రూర్ ను మేము అంబుడ్స్ మెన్ గా నియమించుకుంటున్నం. అంబుడ్స్ మెన్ గా దీపక్ వర్మ నియామకం చెల్లదు. ఈ నెల 18 న అజార్ నియమించిన జిల్లాల అఫిలియేషన్ పై నిర్ణయం తీసుకుంటాం. రేపటి నుండి లీగ్స్ కొనసాగిస్తాం అని తెలిపారు.

అలాగే క్రికెట్ కోసమే అందరం పనిచేస్తున్నాం. స్పోర్ట్స్ మినిస్టర్ రేపు మాచ్ ప్రారంభంకి వస్తున్నారు. మా స్పోర్ట్స్ రూం లాక్ చేశారు.. రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్తాము అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-