తాప్సి “హసీన్ దిల్‌రూబా” ట్రైలర్

మిల్కీ బ్యూటీ తాప్సీ, విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో నటించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ “హసీన్ దిల్‌రూబా”. వినిల్ మాథ్యూ దర్శకత్వం వహించాడు. ఈ థ్రిల్లర్ మూవీ జూలై 2న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. “హసీన్ దిల్‌రూబా” ట్రైలర్‌లో రాణి పాత్రలో నటించిన తాప్సీ పన్నూ రిషు (విక్రాంత్ మాస్సే)ను వివాహం చేసుకుంటుంది. అయితే అనుమానాస్పదంగా రాణి భర్త మృతి చెందడంతో… పోలీసులు రాణి తన భర్త రిషును తన ప్రేమికుడు (హర్షవర్ధన్) సహాయంతో చంపించిందని అనుమానిస్తారు పోలీసులు. రిషు దారుణమైన మరణం అతని భార్యపై అనుమానాలను రేకెత్తిస్తుంది. పోలీసులతో చెప్పినట్లుగా రాణి అమాయకురాలా? లేదా భర్త హత్య వెనుక సూత్రధారినా? అసలేం జరిగింది? ప్రేమ, సమ్మోహనం, వంచన లాంటి ఎమోషన్స్ ఈ ట్రైలర్ లో కన్పిస్తున్నాయి. మరి రాణి తనను తాను నిర్దోషి అని ఎలా నిరూపించుకోగలిగింది. ఈ ట్రైలర్‌లో దర్యాప్తు అధికారిగా సిఐడి స్టార్ ఆదిత్య శ్రీవాస్తవ కన్పించారు. రొమాంటిక్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “హసీన్ దిల్‌రూబా” చిత్రం ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-