‘తఖ్త్’… రాజుల కాలం నాటి రచ్చ ఇప్పుడెందుకు అనుకుంటోన్న కరణ్ జోహర్!

‘తఖ్త్’… చాలా కాలం పాటూ బాలీవుడ్ లో వినిపించిన భారీ పేరు! కానీ, ఈ మధ్య ఎవరూ పెద్దగా మాట్లాడుకోవటం లేదు. కారణం ఏంటి? కరణ్ జోహరే! ఆయనే కొన్నాళ్ల కిందట తాను ‘తఖ్త్’ మూవీ డైరెక్ట్ చేస్తానని ప్రకటించాడు. మొఘల్ రాజుల కాలంలో జరిగిన రాజకీయాలు, రొమాన్స్ లు సినిమాలో ఉంటాయని ప్రచారం జరిగింది. కానీ, రీసెంట్ గా కరణ్ ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమాని స్వయంగా ప్రకటించాడు. మరి ‘తఖ్త్’ సంగతేంటి? ఇక లేనట్టే అంటున్నారు బాలీవుడ్ జనం…

రణవీర్ సింగ్, కరీనా కపూర్ ఖాన్, ఆలియా భట్, విక్కీ కౌశల్, భూమీ పెడ్నేకర్, అనీల్ కపూర్… ఇలా బీ-టౌన్ లోని బడా స్టార్స్ పేర్లు చాలా మందివి వినిపించాయి ‘తఖ్త్’ సినిమా కోసం. కానీ, సుశాంత్ సింగ్ మరణం తరువాత కరణ్ తీవ్రమైన విమర్శల పాలు కావటం, కరోనా లాక్ డౌన్స్ వల్ల బాలీవుడ్ అతలాకుతలం కావటం ‘తఖ్త్’ తలరాతను మార్చేశాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వందల కోట్లు ఖర్చు పెట్టి మొఘల్ రాజుల కాలం నాటి ‘కాస్ట్యూమ్ డ్రామా’ తెరకెక్కించటం పెద్ద రిస్క్ తప్ప మరేం కాదని క్రిటిక్స్ అంటున్నారు. పైగా సొషల్ మీడియాలో కూడా కరణ్ జోహర్ వ్యతిరేక వర్గం ఆయన ప్రతీ సినిమాని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఇటువంటి సమయంలో ఔరంగజేబు కాలం నాటి ముస్లిమ్ మతపరమైన పాలనని, రాజకీయాల్ని పనిగట్టుకుని చిత్రీకరించటం గాలిన పోయే వివాదాల్ని నెత్తి మీద వేసుకున్నట్టేనని కరణ్ కూడా భావించాడట. దాంతో ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ అంటూ తనకు అచ్చొచ్చిన రొమాంటిక్ రాగాన్ని మరోసారి అందుకున్నాడు. రానున్న కాలంలో కూడా ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప ‘తఖ్త్’ మళ్లీ చర్చలోకి వచ్చే అవకాశాలు లేనట్లేనట!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-