వీహెచ్ ను పరామర్శించిన బండారు దత్తాత్రేయ

కిడ్ని సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి వచ్చిన వి.హనుమంతరావును హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు పరామర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం సిమ్లా గవర్నర్గా ఉన్న నేను హనుమంతరావు గారు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారని మీడియా ద్వారా తెలుసుకున్నాను.. ఆ తర్వాత హర్యానా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీలు చూసుకొని హనుమంతరావు గారిని పరామర్శించడానికి వచ్చాను.. హనుమంతరావు గారు నా చిరకాల మిత్రుడు. హనుమంతరావు గారు మృదు స్వభావి తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ప్రజా పోరాటాలు చేసిన వ్యక్తి..ఆలాంటి వ్యక్తి త్వరగా కోలుకొనిమళ్ళీ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలని భగవంతుని కోరుకుంటున్నాను అని తెలిపారు..

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-