ఆవు పేడ తింటున్న డాక్టర్.. నెటిజన్స్ షాకింగ్ రియాక్షన్స్

మన దేశంలో ఆచారాలు, సంప్రదాయాలు ఎక్కువ.. వాటిని పెద్దలు చాలా గోవారవిస్తారు.. గోవు మూత్రం తగిలే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు.. గోవును కామధేనువుగా కొలుస్తారు.. ఇక్కడి వరకు అందరికి తెలుసు.. కానీ, ఆవు పేడ కూడా ఎన్నో లాభాలను కలిగిస్తుందట.. ఇది ఒక డాక్టర్ స్వయంగా తెలిపారు. అంతేకాకుండా ఆవు పేడను తింటూ వాటి ప్రయోయోజనాలను చెప్పే వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

కర్నాల్‌కు చెందిన MBBS, MD, పీడియాట్రీషియన్ మనోజ్ మిట్టల్ ఆవు పేడను తింటున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన దాని గురించి వివరిస్తూ పేడ తినడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఆత్మను శుభ్రపరిచే సామర్థ్యం ఉందని, శరీరాన్ని కూడా శుభ్రపరుస్తుందని చెప్పుకొచ్చాడు. తన తల్లి ఉపవాస సమయంలో పేడను తినేవారని, దానివలన ఆమె చాలా శక్తివంతురాలిగా ఉండేదని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో వైరల్ అవవడంతో నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇదేంటీ బ్రో.. అంట ఈజీగా తినేశావ్.. నేను వండుకున్న రాజ్మా కూడా అంట త్వరగా తినలేను అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు ఏంటి.. నేను చూస్తున్నది నిజమేనా అని కళ్లు తేలేసే వీడియోను పోస్ట్ చేశాడు.. ఆహా .. ఏమి ఆహారం.. కనీసం దీనికి ఉప్పుతో కూడా అవసరం లేదని మరొక వ్యక్తి చమత్కరించాడు.

Related Articles

Latest Articles