పవన్‌ని దూషించడం ఓ గేమ్.. పవన్, పోసాని పావులే..!

జనసేన అధినేత పవన్‌ వ్యాఖ్యలు కామెంట్లు చేయడం.. దానికి ఏపీ మంత్రులు కౌంటర్‌ ఇవ్వడం.. మధ్యలో పోసాని మురళి ఫైర్ అవ్వడం.. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం.. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్ పెరిగింది.. ఇటు సినిమా పరిశ్రమలో కొంత టెన్షన్‌ నెలకొంటే.. పొలిటికల్ కామెంట్లు మాత్రం ఓ రేంజ్‌లో పేలుతున్నాయి.. అయితే, పవన్ కల్యాణ్‌.. మంత్రిని.. ఆ మంత్రి తిరిగి పవన్‌ని దూషించడం అంతా ఒక గేమ్‌ అని వ్యాఖ్యానించారు మాజీ ఎంపీ హర్షకుమార్.. వైసీపీ, పవన్‌, పోసాని ఎపిసోడ్‌పై స్పందించిన ఆయన.. ఈ గేమ్‌లో పవన్ కల్యాణ్‌, పోసానిలను పావులుగా వాడుకుంటున్నారంటూ కామెంటల్ చేశారు.

ఇక, కాకినాడ కేంద్రంగా డ్రగ్స్ దందా జరుగుతోందని విమర్శించారు హర్షకుమార్.. ప్రభుత్వం మద్యంపై ఆధారపడి నడుస్తోందన్న ఆయన.. ఇప్పుడు డ్రగ్స్ వ్యాపారం సైడ్ బిజినెస్‌గా చేస్తున్నట్టు ఉందన్నారు.. హెరాయిన్, చీప్ లిక్కర్‌లో కలుపుతున్నారని అనుమానం వస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ.. 72 వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ పట్టుబడిందంటే చాలా ప్రమాదంలో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఎవరు జోక్యం చేసుకుంటున్నారు అని ప్రశ్నించిన హర్షకుమార్.. ఒక ప్రజా ప్రతినిధి అండతో పోర్టులో ఈ వ్యవహారం జరుగుతోందని.. కేంద్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

-Advertisement-పవన్‌ని దూషించడం ఓ గేమ్.. పవన్, పోసాని పావులే..!

Related Articles

Latest Articles