స్టుపిడ్స్… నెటిజన్ కు హరీష్ శంకర్ స్ట్రాంగ్ రిప్లై

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ట్రోల్స్ కు ఎప్పటికప్పుడు తగిన రిప్లై ఇస్తూ వార్తల్లో నిలుస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ యంగ్ డైరెక్టర్ తాజాగా ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల హరీష్ ఓమిక్రాన్ వ్యాప్తి గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒక ప్రముఖ వైద్య నిపుణుడి వీడియోను పంచుకున్నారు. వైరస్ వ్యాప్తి పట్ల సామాన్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన కోరారు.

Read Also : మ్యూజికల్ నైట్ లో హీరోయిన్ తో కలిసి దుమ్మురేపిన నాగ్, చై

హరీష్ శంకర్ షేర్ చేసిన ఈ వీడియోకు రిప్లైగా ఒక నెటిజన్ హరీష్ శంకర్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని, తీవ్ర ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై వెంటనే స్పందించిన దర్శకుడు ఏదైనా మంచి జరుగుతుందని నిపుణుడు చెప్పినప్పుడు కూడా కొంతమంది ఆశలు పెట్టుకోరు అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. హరీష్ శంకర్ “మీలాంటి మూర్ఖులు నిరుత్సాహానికి గురవుతున్నందుకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే మీలాంటి వారు ఎప్పుడూ ఒక నిపుణుడు ఏదైనా మంచిని చెప్పినప్పుడు, అతను పదేపదే జాగ్రత్తలు తీసుకోవాలని నొక్కిచెప్పినప్పుడు కూడా ప్రజలకు ఆశలు కల్పించాలని కోరుకోరు !!” అంటూ ఘాటుగా స్పందించారు.

హరీష్ శంకర్ ఓమిక్రాన్ కేసుల విషయానికి వస్తే, కోవిడ్ పరిస్థితి గురించి వివరించే వైద్యుడి వీడియోను పంచుకున్నారు. వీడియోలో ఓ వైద్యుడు ఓమిక్రాన్ సాధారణ జలుబు తప్ప మరేమీ కాదని, టీకాలు వేయని వ్యక్తులు మాత్రమే ఎక్కువగా ప్రభావితమవుతారని వెల్లడించారు. మహమ్మారి ముగింపు దశకు చేరుకుంటుందని చెబుతూ అందరూ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సూచించగా, చాలా మంది నెటిజన్లు డాక్టర్, హరీష్ శంకర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడుతున్నారు. కానీ నిజానికి హరీష్ ఉద్దేశ్యం భయాందోళనలు నెలకొన్న ఈ సమయంలో కొంచెం సానుకూలతను వ్యాప్తి చేయడమే. ఇక హరీష్ సినిమా విషయానికొస్తే… పవన్ కళ్యాణ్‌తో కలిసి “భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

Related Articles

Latest Articles