ఈటలపై హరీష్ రావు ఫైర్…ఆయనకు అ, ఆ లు నేర్పిందే కేసీఆర్ !

సిద్ధిపేట : మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మరోసారి మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అన్నం పెట్టింది కేసీఆర్, అ, ఆలు నేర్పింది కేసీఆర్, ఆయన బతికుండగానే సీఎం.. కావాలని ప్రయత్నం చేశాడని ఈటలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్‌ రావు. ఈటల రాజేందర్ కు టిఆర్ఎస్ ఏమి తక్కువ చేసిందని హరీశ్ రావు ప్రశ్నించారు.

read also: తెలకపల్లి రవి : 124(ఎ)రాజద్రోహంపై సిజెఐ రమణ వ్యాఖ్యలు త్వరగా నిజమౌతాయా?

ఈటల రాజేందర్ సీఎం కావాలని బండి సంజయ్, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎందుకు ఖండించలేదన్నారు. కేసీఆర్ బతికుండగానే ఆయన పెట్టిన రైతు బంధు దండగ అని మాట్లాడాడని ఫైర్‌ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందని తెలిపారు. ఎలాంటి శక్తులు టీఆర్‌ఎస్‌ ను ఏం చేయలేవని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-