జీవో 317పై గోబెల్స్ ప్రచారం.. హరీష్ రావు ఫైర్

317 జీవోను అమలు చేసి ప్రతీ ఉద్యోగాన్ని నింపాలని సీఎంగాఆలోచిస్తుంటే, అడ్డుపడుతున్నారని మండిపడ్డారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. కోర్టుల్లో స్టే తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జీవో అమలు కావద్దు. ఉద్యోగాలు నింపవద్దు అంటున్నారు. తెలంగాణ, ఆంధ్ర విడిపోయే సమయంలో కేసీఆర్ అప్పటి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు.

రాజ్ నాథ్ సింగ్ వద్దకు వెళ్లి ఆంధ్ర, తెలంగాణ విడిపోతుంది. తెలంగాణ వాళ్లకు,తెలంగాణలో స్థానికంగా ఇవ్వాలన్నారు. ఆనాడు రాజ్ నాథ్ సింగ్ అలా ఇవ్వడం సాధ్యం కాదన్నారు. రాష్ట్రాలు విభజన గతంలో చేసినట్లు చేస్తాం. తప్ప స్థానికులకు స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వం అన్నారు. అయినా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నదేంటి. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చారు. భారత రాష్ట్రపతి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చారో… అదే జీవోను మేం అమలు చేస్తున్నాం అన్నారు.

రాష్ట్ర పతి ఉత్తర్వులు అమలు చేయవద్దంటున్నారు. రాజకీయ లబ్ధికోసం బీజేపీ మాట్లాడుతోంది. మూడేళ్లలో లక్షా 39 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. ఏ బీజేపీ రాష్ట్రం కూడా ఉద్యోగులకు ఇంత జీతాలు ఇవ్వడంలేదు. కరోనా కష్టకాలంలో పీఆర్సీ 30 శాతం ఇచ్చిన ప్రభుత్వం మాది.

రాఘవ రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించిన పోలీసులు

కేంద్ర ప్రభుత్వం ఏడున్నర శాతం ఇచ్చారు. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకన్నా తక్కువ ఇచ్చింది.ఎక్కడైనా సమస్యలు ఉంటే ఉద్యోగ సంఘాలతో, ఉపాధ్యా సంఘాలతో మాట్లాడి పరిష్కరిస్తాం. బీజేపీది రాద్ధాంతం, బీజేపీది కుట్ర.స్థానికులకు ఉద్యోగాలు దొరకవద్దు అన్న కుటిల నీతి.బీజేపీ మాటలు కేవలం గోబెల్స్ ప్రచారం అని మండిపడ్డారు. పది వేల రైతు బంధు దేశం అంతా ఎందుకు ఇవ్వరు మీకు రైతులపై ప్రేమ ఉంటే ఇవ్వాలన్నారు. మేం ఉద్యోగులకు ఇచ్చినట్లు 30 శాతం ఫిట్మెంట్ మీరు దేశ మంతా ఇవ్వండని సవాల్ చేశారు హరీష్ రావు.

Related Articles

Latest Articles