దేవాదాయ శాఖ కమిషనర్ గా హరి జవహర్ లాల్…

దేవాదాయ శాఖ కమిషనరుగా బాధ్యతలు స్వీకరించారు హరి జవహర్ లాల్. దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు వంటి అంశాలపై ఉద్యోగులతో జవహర్ లాల్ సమీక్ష నిర్వహించారు. అందులో హరి జవహర్ లాల్ మాట్లాడుతూ.. దేవాలయాల్లో కైంకర్యాలు, పూజలు సంప్రదాయ బద్దంగా జరిగేలా చూస్తాం. ఆలయాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించే అంశంపై దృష్టి పెడతాం. ఆధ్యాత్మిక వాతావరణం ఆలయాల వద్ద కనిపించాలి. హిందూ సంప్రదాయాలను గౌరవించేలా, ఆచరించేలా ప్రోత్సహిస్తాం. ఎంతో మంది దాతలు ఆలయాల కోసం భూములు దానంగా ఇచ్చారు. అన్యాక్రాంతమైన స్థలాల పై కూడా ప్రత్యేక దృష్టి పెడతాం ఆలయాల్లో భద్రతను పెంచేలా చూడాలని సీఎం సూచించారు అని తెలిపారు.

ఈ దేవాదాయ భూముల విషయంలో రెవిన్యూ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. చాలా ప్రాంతాలలో కబ్జా గురవడం, ఆక్రమించుకున్న ఘటనలు ఉన్నాయి. ఇటువంటి స్థలాల పై ప్రత్యేక దృష్టి పెట్టి.. విచారిస్తాం. అయితే క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బంది నిజాయితీగా పని చేయాలి. ఎన్వోసీ వివాదాలను కూడా పరిశీలించి పరిష్కరిస్తాం. సర్వే నెంబర్ల విషయంలో కూడా కొంత తప్పు దారి పడుతుంది. వీటి పై గ్రౌండ్ లెవల్ లో పూర్తి గా విచారణ చేసి నిర్ణయం తీసుకుంటాం. పదోన్నతుల విషయంలో చాలా మంది ఎదురు చూస్తున్నారు. దీనిపై కొంత సిబ్బంది లోపం కారణంగా కనిపిస్తుంది. ఈ అంశాల పై పరిశీలన చేసి.. అర్హులైన వారికి పదోన్నతి కల్పిస్తాం అని పేర్కొన్నారు.

-Advertisement-దేవాదాయ శాఖ కమిషనర్ గా హరి జవహర్ లాల్...

Related Articles

Latest Articles