“హరి హర వీర మల్లు” అప్డేట్ అదిరింది !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్”తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత పవన్ “హరిహర వీరమల్లు”ను ప్రారంభించారు. అయితే ఈ సినిమా బడ్జెట్, కరోనా వంటి కారణాలతో ఆగిపోయింది. దీంతో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పక్కన పెట్టేసి సాగర్ కే చంద్ర దర్శకత్వంలో “భీమ్లా నాయక్”ను మొదలు పెట్టేశాడు పవన్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా తరువాత పవన్, క్రిష్ “హరిహర వీరమల్లు”ను పూర్తి చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం పూర్తయ్యింది.

ఇదిలా ఉండగా నేడు పవన్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ “హరిహర వీరమల్లు” నుంచి అప్డేట్ రిలీజ్ చేశారు. “ఎల్లప్పుడూ సమాజం గురించి ఆలోచించేవారు. నిజమైన హీరో మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం గౌరవంగా ఉంది” అంటూ క్రిష్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో “హరిహర వీరమల్లు” సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 2022 ఏప్రిల్ 29న ఈ మూవీ రిలీజ్ కానుంది. జనవరి 12న “భీమ్లా నాయక్” రిలీజ్ కానుందన్న విషయం తెలిసిందే. 2022 ప్రథమార్థంలో పవర్ స్టార్ అభిమానులకు పండగ అన్నమాట. అతి తక్కువ గ్యాప్ లోనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు పవన్.

Read Also : సమంత ఎక్కడ?

ఇప్పటికే పవన్ బర్త్ డే సందర్భంగా ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో “భీమ్లా నాయక్” టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయగా… అది యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. ఇప్పుడు “హరిహర వీరమల్లు” కూడా మెగా అభిమానులను థ్రిల్ చేసింది. ఈ రోజు మొత్తం పవన్ సినిమాల అప్డేట్స్ విడుదల కానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పవన్, సురేందర్ రెడ్డి కాంబోలో వస్తున్న మూవీ నుంచి ప్రీ లుక్ రిలీజ్ కానుంది. ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు హరీష్ శంకర్ మూవీ “పిఎస్పీకే28” అప్డేట్ రానుంది.

ఈ భారీ పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ని ఎ.ఎమ్.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఔరంగజేబు పాత్రలో అర్జున్ కనిపించనుండగా, జాక్వెలిన్ మొఘల్ రాణిగా నటించనున్నారు. 17వ శతాబ్దపు పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించబోతోంది. తెలుగు, తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Image

Related Articles

Latest Articles

-Advertisement-