అతను బదులు కిషన్ ను ఓపెనర్ గా తీసుకోవాలి…

ఐసీసీ ప్రపంచ కప్ 2021 టోర్నీలో భారత్ ఆడిన మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఓడిపోయింది. ఇక ఈ వచ్చే ఆదివారం తమ రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుతో తలపడుతుంది టీం ఇండియా. ఇక ఈ మ్యాచ్ లో జట్టు ఓపెనింగ్ పై భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కొన్ని సలహాలు ఇచ్చాడు. కిసీస్ పై రోహిత్ శర్మతో పాటుగా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ ను తీసుకుంటే బాగుంటుంది అని అన్నాడు. ఎందుకంటే.. కిషన్ పవర్ ప్లే లో బాగా ఆడుతాడు అని చెప్పిన హర్భజన్ అతను ఉంటె బౌలర్లు కూడా కొంత బయపడుతారు. అలాగే కిషన్ పవర్ ప్లే మొత్తం ఆడితే జట్టు 60-70 పరుగుల వరకు చేస్తుంది అని చెప్పాడు. ఇక ప్రస్తుతం ఓపెనర్ గా ఉన్న కేఎల్ రాహుల్ ను ఫామ్ లో లేని సూర్య కుమార్ యాదవ్ స్థానం అయిన నెంబర్ 4 లో బ్యాటింగ్ కు పంపిస్తే బాగుంటుంది అని హర్భజన్ పేర్కొన్నాడు.

Related Articles

Latest Articles