నిఖిల్, పల్లవిల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ… హీరో స్పెషల్ ట్వీట్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గతేడాది పల్లవిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నేటితో వారు పెళ్లి చేసుకుని ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిఖిల్ తన భార్య గురించి చెప్తూ ట్వీట్ చేశారు. ‘ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది … ఎల్లప్పుడూ ఆనందాన్ని స్ప్రెడ్ చేస్తుంది … నా జీవితంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే స్వీట్ ప్రెజెన్స్… పల్లవితో ఒక సంవత్సరం స్వచ్ఛమైన ఆనందం… మాకు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ” అంటూ ట్వీట్ చేసి తన భార్యతో ఉన్న పిక్ ను షేర్ చేసుకున్నాడు నిఖిల్. ఆ పిక్ లో ఇద్దరూ బ్లాక్ డ్రెస్ లో హ్యాపీగా కన్పిస్తున్నారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు నిఖిల్, పల్లవిలకు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక చివరగా ‘అర్జున్ సురవరం’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన నిఖిల్ ప్రస్తుతం ‘కార్తికేయ-2′, ’18 పేజెస్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-