యంగ్ టైగర్ తనయుడు లిటిల్ టైగర్ బర్త్ డే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా లిటిల్ టైగర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నందమూరి అభిమానులు. ఎన్టీఆర్ రియల్టర్, వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని 5 మే 2011న వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ కు ఇద్దరు కుమారులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి కుమారుడి పేరు అభయ్ రామ్. రెండో కుమారుడు భార్గవ్ రామ్. భార్గవ్ రామ్ 2018 జూన్ 14న జన్మించాడు. తనయుడి బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పిక్స్ షేర్ చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే… ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం “ఆర్ఆర్ఆర్”తో బిజీగా ఉన్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా కనిపించనున్నాడు. ఈ చిత్రం తరువాత కొరటాల దర్శకత్వంలో “ఎన్టీఆర్30”, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “ఎన్టీఆర్31” చిత్రాలలో నటించనున్నారు.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-