సాగరతీరాన… 21 ఏళ్ల సాగరకన్య!

‘దట్స్ ఏ ర్యాప్’ అంటూ అందమైన సూర్యాస్తమ సమయంలో సముద్ర తీరాన తీసిన ఓ బ్యూటిఫుల్ పిక్ పోస్ట్ చేసింది హ్యాలీ బెయిలీ! ‘ద లిటిల్ మెర్మెయిడ్’ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్టు ఆమె ఇన్ స్టాలో ప్రకటించింది. అంతే కాదు, తన లైవ్ యాక్షన్ మూవీ కోసం ఇంత కాలం కొనసాగిన సుదీర్ఘ ప్రయాణం గురించి హ్యాలీ నెటిజన్స్ తో తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది. ‘ద లిటిల్ మెర్మెయిడ్’ కోసం ఆడిషన్స్ కు అటెండ్ అయినప్పుడు ఆమె వయస్సు 18 ఏళ్లట! కరోనా ప్యాండమిక్ అడ్డంకులతో ఎట్టకేలకు సినిమా పూర్తి చేసేసరికి 21 ఏళ్లు నిండాయని తెలిపింది!

“నాకు తెలిసిన ప్రపంచానికి, తెలిసిన వాళ్లకి దూరంగా ఇంత కాలం ఉండాల్సి వచ్చింది. ఈ అనుభవం నన్ను ఎంతగానో రాటుదేల్చింది. కాలం ఇక మీదట త్వరగా గడిచిపోతే బావుండునని కోరుకుంటున్నా! ఎందుకంటే, మేం ఎంతో ప్రేమతో, రక్తం, స్వేదం, కన్నీళ్లు ధారపోసి ‘ద లిటిల్ మెర్మెయిడ్’ సినిమా చేశాం. మీరు కూడా త్వరగా చూడాలని ఆశిస్తున్నా!’’ అంటోంది హ్యాలీ…
అందమైన సన్ సెట్ పిక్ తో హ్యాలీ బెయిలీ తమ సినిమా ముగిసిందని ప్రకటించటంతో క్లాసిక్ ఫెయిరీటేల్ ఎప్పుడు థియేటర్స్ కు వస్తుందా అని మూవీ లవ్వర్స్ ఎదురు చూస్తున్నారు. ‘ద లిటిల్ మెర్మెయిడ్’లో హీరోయిన్ ఓ సాగరకన్య. ఆమె ఓ మానవుడితో ప్రేమలో పడి తన లోకం నుంచీ మన లోకంలోకి రావటమే కథ…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-