కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు జీవీఎల్‌ లేఖ

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపీ ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు. తిరుపతి ఎయిర్‌పోర్టు ఉద్దేశపూర్వకంగా నీటి సరఫరా నిలిపివేతపై ఫిర్యాదు చేశారు.విమానాశ్రయానికి నీటి సరఫరా నిలిపివేతపై విచారణ చేపట్టాలని కోరిన జీవీఎల్ నరసింహరావు. ఈవారం ప్రారంభంలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం మరియు విమానాశ్రయ సిబ్బంది నివాస గృహాలకు నీటి సరఫరాను అకస్మాత్తుగా నిలిపివేశారని లేఖలో పేర్కొన్నారు. జనవరి 10న తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్ హఠాత్తుగా విమానాశ్రాయనికి నీటి సరఫరాను నిలిపి వేసిందన్నారు. అధికార వైసీపీ పార్టికి చెందిన కొంతమందికి విమానాశ్రయ ప్రవేశం నిరాకరించారు. ఆ తర్వాత రోజు క్వార్టర్లకు నీటి సరఫరాను నిలిపేశారు.ఈ ప్రతీకార ఆలోచనా రహిత చర్య తిరుపతి విమానాశ్రయానికి వెళ్లే వందలాది మంది ప్రయాణికులను అసౌకర్యానికి గురి చేసిందని లేఖలో తెలిపారు.

Read Also: హత్యా రాజకీయాలు నేను ప్రోత్సహించను: చంద్రబాబు

దీంతో క్వార్టర్స్‌లోని నివాస గృహాల్లోని కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు.
నివాస గృహాలకు వెళ్లే రోడ్లు అకస్మాత్తుగా తవ్వడంతో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లతోపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని జీవీఎల్‌ లేఖలో వివరించారు. మరమ్మతుల వల్లే సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు చెబుతున్నా.. ఈ వివరణ అవాస్తవమని జీవీఎల్‌ ఆరోపించారు. వైసీపీ స్థానిక నేతలు ప్రతీకార చర్యలు తీసుకునేందుకు నీటిని నిలిపివేశారన్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి, స్వతంత్రంగా విచారణ జరిపించాలని లేఖలో వెల్లడించారు.

Related Articles

Latest Articles