బుగ్గన ఆర్థికమంత్రిగా కంటే…అప్పుల మంత్రిగా కనిపిస్తున్నాడు !

ఢిల్లీ : బుగ్గన రాజేంద్ర నాథ్ ఆర్థిక మంత్రిగా కన్నా అప్పుల మంత్రిగా బాగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు జివిఎల్ నరసింహారావు. ఏపీ అప్పుల ఆంద్రప్రదేశ్ గా మారిందని దేశం మొత్తానికి తెలిసిందని…కొత్త అప్పుల కోసం రోజూ ప్రయత్నాలు చేసే పరిస్థితి ఏర్పడిందని ఫైర్‌ అయ్యారు జివిఎల్ నరసింహారావు. ఓటు బ్యాంకు కోసం, పథకాల కోసం రుణాలు చేస్తున్నారని… ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శలు చేశారు. పెన్షన్లు..జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని.. అప్పుల పై చూపించే శ్రద్ధ మరేతర అంశంపై ప్రభుత్వానికి లేదని తెలిపారు.

read also : కర్నూలు జిల్లా వైసీపీలో వారసుల హవా!

రోజూ కొత్త అప్పులు తీసుకొచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారని… అప్పులు పుట్టించడానికి ఏపిలో “స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్” ఏర్పాటు చేసుకున్నట్లు గా ఉందని చురకలు అంటించారు. “ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్” ఏర్పాటు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించేలా ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరణలు చేసుకోవాలని హెచ్చరించారు. “ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్” ఏర్పాటు, అప్పులు చేయడం, రాజ్యాంగ ఉల్లంఘనల అంశాలను కేంద్ర ఆర్ధికమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-