అమ్మాయిల వేటలో పెళ్లికాని ప్రసాద్ లు.. వయస్సు ముదురుతుండడంతో

భారతదేశంలో ఆడపిల్లల నిష్పత్తి రోజురోజుకు తగ్గిపోతుంది.. బ్రూణ హత్యలు, అత్యాచారాలు, ఇతరత్రా కారణాల వలన ఆడపిల్లలను పొట్టన పెట్టుకుంటున్నారు. దీనివల్లనే సమాజంలో ఆడవారి సంఖ్య తగ్గుతుంది. తాజాగా అమ్మాయిల కొరతతో అబ్బాయిల పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఎంతోమంది పెళ్లి కానీ ప్రసాద్ లు తమ పెళ్లిళ్ల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజా సరే ప్రకారం 100 మంది అబ్బాయిలకు కేవలం 80 మంది అమ్మాయిలు మాత్రమే దొరుకుతున్నారట.. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్క ముదిరిపోయిన బెండకాయల్లా తయారవుతన్నారట.

సాధారణంగా ఈ కాలం యువత.. ఉద్యోగం లేకుండా, కెరియర్ సెట్ కాకుండా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. అవన్నీ సెట్ అయ్యాకా అమ్మాయి కోసం వెతుకుతుంటే దొరకడం లేదని అబ్బాయిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య ప్రతి రాష్ట్రంలోను ఉంది. ముఖ్యం బ్రాహ్మణ తెగ వారికి అమ్మాయిలు దొరకడం కష్టంగా మారింది. తమిళనాడులోని బ్రాహ్మణ యువకులు 30- 40 ఏళ్లు వచ్చినా పెళ్లి కానీ ప్రసాద్ ల్లానే మిగిలిపోతున్నారట.. తమిళనాడు మొత్తం మీద 40 వేలమంది బ్రాహ్మణ యువకులు పెళ్లి కాకుండా ఇంకా అమ్మాయిల వేటలో ఉన్నారట.. వీరి కోసం పక్క రాష్ట్రంలో కూడా యువతులను వెతుకుతున్నారట మ్యారేజ్ సెటిలర్స్.. తమిళనాడు బ్రాహ్మణ సమాజం లో వివాహ పద్ధతులతో కూడా అబ్బాయిలు పెళ్లికాని ప్రసాదుల్లా మిగిలిపోవడానికి కారణమని అంటున్నారు. ఈ వర్గంలో కట్న కానుకలతో పాటు పెళ్లి ఖర్చులు కూడా యువతి తల్లిదండ్రులే భరించాలి.

కట్నం ఇవ్వడమే అంతంత మాత్రంగా ఇచ్చే మధ్యతరగతి తల్లిదండ్రులు పెళ్లి కూడా ఘనంగా చేయాలి అంటే కొద్దిగా వెనకాడుతున్నారు అంట… దానివల్లనే ఈ వర్గంలో పెళ్లిళ్లు చాలా తక్కువ జరుగుతున్నాయని అంటున్నారు. ఒక్క తమిళనాడు మాత్రమే ఈ సంధ్యను ఎదుర్కోవడం లేదు.. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోనూ అమ్మాయిల వేటలో అబ్బాయిలు పడుతున్నారు. కట్నం, హోదాను పక్కన పెట్టి అమ్మాయి దొరికితే చాలు అనుకొనే అబ్బాయిలు లేకపోలేదు. ఏదిఏమైనా వయస్సు ముదురుతుండడంతో పెళ్లికి కాస్త తొందరపడుతున్నారట మన పెళ్లి కానీ ప్రసాద్ లు..

Related Articles

Latest Articles