దొంగ నాటకాలాడే బీజేపీని నమ్మొద్దు : గుత్తా సుఖేందర్‌ రెడ్డి

తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే తాజాగా సీఎం కేసీఆర్‌ దళిత బంధును అందజేయాలని కార్యచరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతు బంధు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు.

దేవరకొండలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపటితో 50 వేల కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో జమకానున్నాయన్నారు. దొంగ నాటకాలాడే బీజేపీ ని నమ్మొద్దని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అతిగతి లేని కాంగ్రెస్‌ను ఎవరు పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ వాళ్ల మధ్యే కుమ్ములాటలున్నాయన్నారు. మతకల్లోలాలు, అల్లకల్లోలాలు సృష్టించి అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

Related Articles

Latest Articles