అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల క‌ల‌క‌లం: 11 మంది మృతి…

అమెరికాలో మళ్లీ కాల్పుల క‌ల‌క‌లం రేగింది.  ఈ కాల్పుల్లో 11 మంది మృతి చెందిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు.  శ‌ని, ఆదివారాల్లో అమెరికాలోని వాషింగ్ట‌న్‌, ఫ్లోరిడా, హ్యూస్ట‌న్ సిటిలో కాల్పులు జ‌రిగాయి.  ఫ్లోరిడాలో ఓ సైకో జ‌రిపిన కాల్పుల్లో న‌లుగురు, హ్యూస్ట‌న్ లో న‌లుగురు, వాషింగ్ట‌న్‌లో ముగ్గురు మృతి చెందారు.  విచ్చ‌ల‌విడిగా గ‌న్ క‌ల్చ‌ర్ పెరిగిపోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని అధికారులు చెబుతున్నారు.  గ‌త కొంత‌కాలంగా అమెరికాలో గ‌న్‌కల‌చ్చ‌ర్ పెరిగిపోతున్న‌ది.  క‌రోనా కాలంలో ఈ గ‌న్ క‌ల్చ‌ర్ మ‌రింత‌గా పెరిగింది.  దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, భ‌ద్ర‌తాలోపం, మాన‌సిక ఒత్తిళ్ల కారణంగా ఇలా కాల్పుల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని అధికారులు చెబుతున్నారు.  

Read: ఆఫ్ఘ‌న్ అంత‌ర్యుద్ధం: 700 మంది తాలిబ‌న్లు హ‌తం…

Related Articles

Latest Articles

-Advertisement-