మెగాస్టార్ తో స్టార్ డైరెక్టర్ బిగ్ ప్లాన్

పౌరాణిక చిత్రాల దర్శకుడు గుణశేఖర్ స్టార్ హీరోలతో కలిసి పని చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా “చూడాలని ఉంది” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు గుణశేఖర్‌కు స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ను కూడా ఇచ్చింది. ఆ తరువాత గుణశేఖర్-చిరు కాంబినేషన్లో సినిమా రాలేదు. డైరెక్టర్ గుణశేఖర్ వరుసగా పౌరాణిక చిత్రాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన భారీ పీరియాడిక్ మూవీ “శాకుంతలం” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అయితే గుణశేఖర్‌కు చిరంజీవితో మరో సినిమా చేయాలనే కోరిక ఇంకా ఉంది. ఇటీవల గుణశేఖర్ మాట్లాడుతూ తన దగ్గర ఉన్న ఓ సోషల్ డ్రామా చిరుకు, ఆయన శైలికి సరిగ్గా సరిపోతుందని, ఈ ఏజ్ లో ఆయన ఇంతకుముందుకన్నా ఫిట్ గా కన్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు చిరంజీవి ఎప్పటికి తన ఫేవరేట్ స్టార్ అని అన్నారు. ఈ వార్త విన్న మెగా అభిమానులు ఇప్పట్నుంచే చిరు-గుణశేఖర్ ప్రాజెక్ట్ పై ఆసక్తిని కనబరుస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పట్టాలెక్కుతుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-