వెండితెరపైకి ప్రజానాయకుడు ‘గుమ్మడి నర్సయ్య’ జీవిత చరిత్ర!

కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్న నాయకులను చూస్తున్నాం. అలాంటిది ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి, ఓ పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినా నిజాతీయికి నిలువుటద్దంలా రాజకీయ ప్రస్థానం సాగించారు సీపీఐ (ఎంఎల్) నేత గుమ్మడి నర్సయ్య. శాసనసభకు బస్సులో వచ్చే ఏకైక ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సయ్య నిరాడంబర జీవితం ఆదర్శనీయంగా మీడియా ప్రశంసించింది. ప్రజా జీవితంలోనే తన జీవితాన్ని చూసుకున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథతో సినిమా రూపొందుతోంది. పరమేశ్వర్ అనే కొత్త దర్శకుడు ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు.

Read Also : గోపాలపురంలో ఎన్టీఆర్… వ్యవసాయ భూమి కొనుగోలు

తాజాగా గుమ్మడి నర్సయ్య బయోపిక్ టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. టైటిల్ లోగో విడుదల చేసిన అనంతరం దర్శకుడు సుకుమార్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఒక ఆదర్శవంతమైన నాయకుడి గురించి ఈ తరంతో పాటు రాబోయే తరాల ప్రజలకు, రాజకీయ నాయకులకు తెలిసేలా గుమ్మడి నర్సయ్య బయోపిక్ ఉండబోతోంది. ఈ సినిమాలో నటించే నటీనటులు, సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

-Advertisement-వెండితెరపైకి ప్రజానాయకుడు 'గుమ్మడి నర్సయ్య' జీవిత చరిత్ర!

Related Articles

Latest Articles