‘గల్లీ రౌడీ’ ట్రైలర్ రిలీజ్ రేపటికి వాయిదా !

సందీప్ కిషన్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ‘గల్లీ రౌడీ’ ట్రైలర్ రిలీజ్ రేపటికి వాయిదా పడింది. నిజానికి ఈ ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేయాలనుకున్నారు. అయితే సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ వల్ల రేపటికి మారింది. ‘స్టేట్ రౌడీ’ చిరంజీవి గారు ఈ ట్రైలర్ ను ఆదివారం ఉదయం 10.30కి ట్విటర్ లో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కోన ఫిలిమ్ ఫ్యాక్టర్, ఎం.వి.వి. సినిమా నిర్మిస్తున్న ఈ సినిమాకు జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 17న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాబీ సిన్హా ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా చౌరస్తా రామ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read Also : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ మరోసారి వాయిదా!

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-