“గల్లీ రౌడీ” రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవలే “ఏ1 ఎక్స్ ప్రెస్” అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ చిత్రానికి విభిన్నమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ హీరో “గల్లీ రౌడీ” చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ కామెడీ ఎంటర్టైనర్ కు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా… బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వివా హర్ష, పోసాని, వెన్నెల కిషోర్ లు ఈ చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఎంవివి సత్యనారాయణ దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లకు, సాంగ్స్ కు మంచి స్పందనే వచ్చింది. మే 1న సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Read Also : దేవిశ్రీ ప్రసాద్ కు ఐకాన్ స్టార్ సర్ ప్రైజ్ గిఫ్ట్

కానీ కరోనా మహమ్మారి కారణంగా అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయలేకపోయారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం థియేటర్ల రీఓపెన్ కు అనుమతినిస్తూ సడలింపులు ప్రకటించింది. దీంతో థియేటర్లు తెరుచుకోగానే వరుసగా సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇప్పుడు రాబోయే పోటీని దృష్టిలో పెట్టుకుని ఓటిటిల బాట పడుతున్నారు. ఇప్పుడు ‘గల్లీ రౌడీ’ కూడా ఓటిటిలోనే విడుదల కానుంది అనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై మేకర్స్ స్పందించారు. సినిమా థియేటర్లలోనే విడుదలవుతుంది. సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తున్నాము అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ‘గల్లీ బాయ్’ థియేటర్లలోనే పలకరించనున్నాడన్న మాట.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-