17న థియేటర్స్‌లో ‘గ‌ల్లీ రౌడీ’

సందీప్ కిషన్ టైటిల్ పాత్ర పోషించన ‘గల్లీ రౌడీ’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. సూపర్ హిట్ చిత్రాల రచయిత కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పోరేషన్, ఎంవీవీ సినిమా సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను ఈ నెల 17న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు బాబీ సింహ విలన్ గా నటించటం విశేషం. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించామని థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందుతారని చెబుతున్నారు నిర్మాతలు. ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడానకి పెద్ద రౌడీ అని బిల్డప్ ఇచ్చిన యువకుడు… ఆ తర్వాత ఎలాంటి పాట్లు పడ్డాడు. ఆ అమ్మాయిని ప్రేమను ఎలా గెలుచుకున్నాడన్నదే ఈ చిత్రం కథాంశం. మరి వరుస పరాజయాలతో ఉన్న సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’తో మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-