తెలంగాణను వణికించిన ‘గులాబ్‌’ తుఫాన్‌

తెలంగాణను గులాబ్‌ తుఫాన్‌ వణికించింది. సైక్లోన్‌ ప్రభావంతో ఆకాశానికి చిల్లు పడిందా అన్న విధంగా కురిసిన వర్షానికి.. పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంపై మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. నిన్న రాత్రి నుంచి విరామం లేకుండా కురిసిన కండపోత వానకు భాగ్యనగరం ముగినిపోయింది. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకే నగరంలో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. జడివానతో కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీళ్లొచ్చి చేరాయి. రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గండిపేట జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్ట్‌ నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తి మూసి నదిలోకి విడుదల చేశారు అధికారులు. జాగ్రత్తగా ఉండాలని మూసి పరివాహక ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ చేశారు.రాజన్న సిరిసిల్లలోనూ వర్షాలు విరుచుకుపడ్డాయి. సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ జలమయం అయ్యింది. వేముల వాడ పట్టణంలోని పలు కాలనీల్లో వరద చేరింది.

ఇక వేములవాడ-మల్లారం హనుమాజీపేట నక్క వాగు ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వైరా, మధిర నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. అశ్వాపురం, కరకగూడెం మండలాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. 20కిపైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా.. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు ఉగ్రరూపం దాల్చాయి. ఎల్లంపల్లి, కడెం, సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని దాదాపు 20గ్రామాలకు జిల్లా కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి.డు సమీక్షిస్తున్నారు.

-Advertisement-తెలంగాణను వణికించిన 'గులాబ్‌' తుఫాన్‌

Related Articles

Latest Articles