అన్‌లాక్‌.. జూన్ 7 నుంచి అన్ని ఆఫీసులు ఓపెన్..!

క‌రోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ‌తో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌గా.. మ‌రికొన్ని రాష్ట్రాలు క‌ర్ఫ్యూ పేరుతో క‌ఠిన చ‌ర్య‌ల‌కు పూనుకున్నాయి.. ఓ దేశ‌లో రోజువారి కేసులు దేశ‌వ్యాప్తంగా 4 ల‌క్షల‌కు పైగా న‌మోదు కాగా.. క్ర‌మంగా త‌గ్గుతూ ఇప్పుడు ల‌క్షకు చేరువ‌య్యాయి.. మృతుల సంఖ్య కూడా త‌గ్గుతూ వ‌స్తోంది.. ఇదే స‌మ‌యంలో.. గుజరాత్‌లో కరోనా కొత్త కేసులు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి.. దీంతో.. లాక్‌డౌన్ నుంచి క్ర‌మంగా అన్‌లాక్‌కు వెళ్లోంది ఆ రాష్ట్రం.. ఇవాళ భారీగా స‌డ‌లింపులు ప్ర‌క‌టించారు.. ఈ నెల 7వ తేదీ నుంచి 100 శాతం హాజ‌రుతో అన్ని ఆఫీసుల‌ను ఓపెన్ చేసుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది ప్ర‌భుత్వం.. ఇప్ప‌టికే 36 న‌గ‌రాల్లో అన్ని షాపుల‌ను ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కూ తెరిచేందుకు అనుమ‌తి ఇవ్వ‌గా.. రెస్టారెంట్ల హోం డెలివ‌రీ సేవ‌ల‌కు మాత్రం రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు అనుమ‌తిచ్చింది.. అయితే, లాక్‌డౌన్ నిబంధ‌న‌లు మాత్రం జూన్ 11వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని ప్ర‌క‌టించింది.. నైట్‌ క‌ర్ఫ్యూ ఈ నెల 11వ తేదీ వ‌ర‌కు పొడిగించిన‌ట్టు ప్ర‌క‌భుత్వం పేర్కొంది. తాజాగా ఆ రాష్ట్రంలో 1200కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, మ‌రో 17 మంది మృతిచెందారు.. అయితే, ప్ర‌స్తుతం అన్ని కార్యాల‌యాలు 50 శాతం ఉద్యోగుల‌తో న‌డుస్తున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-