చంద్రబాబుకి ఏపీలో ఆధార్ కార్డ్ అయినా ఉందా : గుడివాడ అమర్నాథ్

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలపై పగబట్టారు అని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. గుజరాత్ లో డ్రగ్స్ పట్టుబడితే ప్రభుత్వంపై టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వంలో ఉండే పెద్దలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే వైసీపీ చూస్తూ ఉరుకోదు. రాజకీయాలు చేయడానికి శవాలు ఎక్కడ దొరుకుతాయా…అని ఎదురు చూసే పరిస్థితికి ప్రతిపక్షం దిగజారింది. హెరిటేజ్ వాహనంలో డబ్బులు, ఎర్ర చందనం అక్రమ రవాణా చేసిన చరిత్ర మీకే ఉంది అని తెలిపారు.

వైసీపీ నాయకత్వం మీద మాట్లాడే నైతిక హక్కు బంట్రోతులకు లేదు. చంద్రబాబు నాయుడుకి ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డ్ అయినా ఉందా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో వుండి ఆంద్రప్రదేశ్ మీద మాత్రం విషప్రచారం చేస్తున్నారు. 20ఏళ్ళు ఎమ్మెల్యే గా, మంత్రిగా పని చేసిన అయ్యన్నపాత్రుడు ఈ ప్రాంతం అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలి. మా గుండెలపై చెయ్యి వేసి కుంటే లబ్ డబ్ మని అంటే…. ఆయ్యన్న గుండె మాత్రం పేగ్…పేగ్ అని కొట్టుకుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు భూములు అమ్మ లేదా… తెలంగాణ ప్రభుత్వం కోకా పేటలోఎకరా 40కోట్ల రూపాయలకు భూములు అమ్మ లేదా అని అడిగారు. లక్షా 10వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది మా ప్రభుత్వమే. ఆర్ధిక ఇబ్బందులు నేపథ్యం కొన్ని నిర్ణయాలను తప్పక తీసుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వేల ఎకరాల భూములు కాపాడాం. కావాల్సిన బ్రాండ్ దొరక్క బుర్ర పాడైపోయి ఆయ్యన్న పాత్రుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు.

-Advertisement-చంద్రబాబుకి ఏపీలో ఆధార్ కార్డ్ అయినా ఉందా : గుడివాడ అమర్నాథ్

Related Articles

Latest Articles