థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమౌతున్న ‘జిఎస్టీ’!

తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ లో కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మించిన సినిమా ‘జీఎస్టీ’ (గాడ్ సైతాన్ టెక్నాలజీ). ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విడుదల చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ బాగుందని, అలానే సినిమా కాన్సెప్ట్ ను దర్శకుడు తనకు చెప్పారని, అది కూడా ఆసక్తికరంగా ఉందని, ఈ సినిమా ద్వారా చక్కని సందేశాన్ని కూడా ప్రేక్షకులకు ఇవ్వబోతున్నారని అన్నారు.

జూనియర్ సంపు మాట్లాడుతూ, ”సినిమాను ఓటీటీలో విడుదల చేయమని దర్శక నిర్మాతలను కోరినా వారు అంగీకరించలేదని, చక్కటి క్వాలిటీతో, సౌండ్ ఎఫెక్ట్స్ తో, నేపథ్యం సంగీతంతో ఉన్న ఈ సినిమాను థియేటర్లలోనే చూడడం సబబుగా ఉంటుందని చెప్పార’ని అన్నారు. ఈ కథ గురించి దర్శకుడు జానకి రామ్ ఎంతో రీసెర్చ్ చేశారని, ఇందులో వినోదానికీ పెద్ద పీట వేశారని చెప్పారు. సినిమా టైటిల్ ‘జీఎస్టీ’ (గాడ్ సైతాన్ టెక్నాలజీ) అనే దానిని చూసి ఇది హారర్ మూవీ అనే భావన కలగడం సహజమని, కానీ ఇందులో లవ్, కామెడీ, రొమాన్స్, సస్పెన్స్ అన్నీ ఉంటాయని హీరోయిన్ స్వాతి మండల్ తెలిపింది. ఈ సమాజంలో దేవుడు, దెయ్యం, సైన్స్ అంశాలపై చాలా మందిలో చాలా అనుమానాలు, అపోహలు ఉన్నాయని, వాటికి సమాధానంగా ఈ సినిమాను చెప్పుకోవచ్చునని దర్శకుడు జానకిరామ్ అన్నారు.

థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమౌతున్న 'జిఎస్టీ'!

Related Articles

Latest Articles

-Advertisement-