పెళ్లిలో మ‌ట‌న్ లేద‌ని… వ‌రుడు…

పెళ్లిళ్ల‌లో అల‌క‌లు, కొట్లాటలు, విసుగులు స‌హ‌జ‌మే.  అమ్మాయి త‌ర‌పువారిని ఇబ్బందులు పెట్టి కావాల్సిన చేయించుకుంటుంటారు.  త‌ప్ప‌ద‌ని అమ్మాయి త‌ర‌పు బంధువులు కూడా చేస్తుంటారు. ఒక్కోసారి కూర‌లు కూడా పెళ్లిళ్లలో కీల‌కంగా మారుతుంటాయి.  పెద్ద గొడ‌వ‌లు సృష్టిస్తుంటాయి.  పెళ్లిళ్లు ర‌ద్దు చేసుకునే వ‌ర‌కూ తీసుకెళ్తుంటాయి.  ఇలాంటి సంఘ‌ట‌న ఒడిశాలో జ‌రిగింది.  ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా మ‌న‌తిరా గ్రామంలో వివాహానికి అంగ‌రంగ‌వైభ‌వంగా ఏర్పాట్లు చేశారు.  వివాహం స‌మ‌యంలో ఏర్పాటు చేసిన విందులో మ‌ట‌న్ పెట్ట‌లేదు.  

Read: బాసరలో అక్రమాలు.. సర్కార్ చర్యలు

దీంతో అబ్బాయి త‌ర‌పు బంధువులు త‌మ‌కు మ‌ట‌న్ కావాల‌ని అడిగితే లేద‌ని చెప్ప‌డంతో గొడ‌వ మొద‌లైంది.  పెళ్లికొడుకు కూడా బంధువుల‌కు వ‌త్తాపు ప‌ల‌క‌డంతో ఆ గొడ‌వ మ‌రింత ముదిరి చివ‌ర‌కు వివాహం ర‌ద్దు చేసుకునే వ‌ర‌కు వ‌చ్చింది.  వివాహాన్ని ర‌ద్దుచేసుకొని వెళ్లిపోయిన వ‌రుడు, ఆ మ‌రుస‌టిరోజే, మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.  ఈ న్యూస్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  

-Advertisement-పెళ్లిలో మ‌ట‌న్ లేద‌ని... వ‌రుడు...

Related Articles

Latest Articles