ప్రతాప్ పోతన్ కీలక పాత్రధారిగా ‘గ్రే’!

నాలుగు దశాబ్దాలకు పైగా దక్షిణాది భాషా చిత్రాలలో నటిస్తున్నాడు ప్రతాప్ పోతన్. పాత్రను ఆకళింపు చేసుకుని తనదైన బాణీలో దానిని తెర మీద ప్రెజెంట్ చేయడం ఆయన ప్రత్యేకత. అందుకే ఇప్పటికీ ప్రతాప్ పోతన్ ను అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితంతో సచిన్ జోషి ‘వీడెవడు’ చిత్రంలో నటించిన ప్రతాప్ పోతన్ మరోసారి తెలుగు సినిమా ‘గ్రే’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధానపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను రాజ్ మదిరాజు దర్శకత్వంలో కిరణ్ కల్లాకురి నిర్మిస్తున్నారు. అద్వితీయ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్న ‘గ్రే’ చిత్రానికి ‘ద స్పై హూ ల‌వ్డ్ మి’ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసి, ప్రసాద్ లాబ్ లో గుమ్మడికాయ కొట్టారు.

Read Also : రేపే హిందీ ‘జెర్సీ’ ట్రైలర్

ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ మదిరాజ్ మాట్లాడుతూ, ”ఇదొక స్టైలిష్‌ స్పై థ్రిల్లర్ మూవీ. ట్విస్టులు ట‌ర్నుల‌తో ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా ఉంటుంది. 20 రోజుల పాటు నిర్విరామంగా హైద‌రాబాద్‌లోని ప‌లు అంద‌మైన లొకేష‌న్స్ లో షూటింగ్ జ‌రిపాం. నిర్మాత కిర‌ణ్‌గారు పూర్తి స‌హ‌కారం అందించారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఔట్‌పుట్ ప‌ట్ల మా టీమ్ అంద‌రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. త‌ప్ప‌కుండా ఒక డిఫ‌రెంట్ మూవీ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు. నాగరాజు తల్లూరి ‘గ్రే’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ప్రతాప్ పోతన్ కీలక పాత్రధారిగా 'గ్రే'!

Related Articles

Latest Articles