ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం.. 65 మంది మహిళా టీచర్లకు ఆ వీడియో పంపి

ప్రస్తుతం ప్రతిఒక్కరు స్మార్ట్ ఫోన్లోనే ఉంటున్నారు.. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ అంటూ వాటితోనే జీవితం గడుపుతున్నారు. అలాంటి మీడియా గ్రూపుల్లో ఎవరైనా ఏదైనా పోస్ట్ చేస్తున్నారంటే కొద్దిగా ఆలోచించాలి. ముందు వెనుక ఆలోచించకుండా ఏది పడితే అది పోస్ట్ చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. తాజాగా అలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఒక ఉపాధ్యాయుడు చేసిన నిర్వాకం 65 మంది మహిళా టీచర్లకు కోపం తెప్పించింది.

వివరాల్లోకి వెళితే.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో మధ్యప్రదేశ్‌లోని స్టేట్ ఎడ్యుకేషన్ సెంటర్ కీలక నిర్ణయం తీసుకొంది. అందులో భాగంగానే విద్యార్థుల తల్లిదండ్రులకు, టీచర్లకు కలిపి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఏ విషయమైన ఆ గ్రూప్ నుంచే డిస్కస్ చేయాలనీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ గ్రూప్ లోనే కృపాశంకర్ అనే ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు. అతను రెండు రోజులు క్రితం ఒక పాడుపని చేశాడు. అనుకోకుండా ఆ వాట్సాప్ గ్రూప్ లో ఒక అశ్లీల వీడియో లింక్ ని షేర్ చేశాడు. అందరు అదేదో ముఖ్యమైన లింక్ అనుకోని ఓపెన్ చేసి షాక్ అయ్యారు. అయితే ఆ లింక్ అశ్లీల వీడియో లింక్ అని తెలిసిన వెంటనే సదరు టీచర్ లింక్ డిలీట్ చేశాడు.అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

ముఖ్యంగా ఆ గ్రూప్ లో ఉన్న 65 మంది మహిళా టీచర్లు ఆయన చేసిన పనికి ఖంగుతిన్నారు.అనంతరం పలువురు ఆ గ్రూప్‌ నుంచి లెఫ్ట్ అయ్యారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇక ఈ ఘటనపై కృపాశంకర్ స్పందిస్తూ పొరపాటున ఆ లింక్ షేర్ అయ్యిందని, కావాలని చేయలేదని, అందరు తనను క్షమించాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోనున్ట్నట్టు సమాచారం.

Related Articles

Latest Articles