తిరుమ‌ల‌లో హ‌నుమ‌త్ జ‌యంతి వేడుక‌ల‌పై గోవిందానంద స‌రస్వ‌తి కీల‌క వ్యాఖ్య‌లు…

తిరుమ‌ల‌లో హ‌నుమ‌త్ జ‌యంతి వేడుక‌ల‌ను ఐదు రోజుల‌పాటు టీటీడి నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.  టీటీడీ నిర్వ‌హిస్తున్న ఈ వేడుక‌ల‌పై హ‌నుమ‌త్ జ‌న్మ‌తీర్థ ట్ర‌స్ట్ వ్వ‌వ‌స్థాప‌కులు గోవిందానంద స‌ర‌స్వ‌తి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.  తిరుమ‌ల‌లో టీటీడీ హ‌నుమ‌త్ జ‌యంతి వేడుక‌లు చేయ‌డం అసంబ‌ద్దం అని అన్నారు.  జన్మ‌తిథి తెలియ‌ద‌ని చెప్పిన టీటీడీ ప్రచార‌పుస్తకంలో మూడు జ‌న్మ‌తిథులను ఎలా ప్ర‌చురించింద‌ని అన్నారు.  జ‌న్మ‌తిథిని త‌ప్పుగా ప్ర‌చురించార‌ని, మొద‌ట్లో హ‌నుమంతుడు జ‌పాలీ తీర్థంలో జ‌న్మించార‌ని చెప్పిన టీటీడీ ఇప్పుడు ఆకాశ‌గంగ‌లో పుట్టార‌ని చెబుతున్న‌ద‌ని అన్నారు.  టీటీడీ చెబుతున్న‌వ‌న్నీ అబ‌ద్దాలే అని, ఏ జ‌న్మ‌తిథిలో హ‌నుమంతుడు పెట్టారో తెలియ‌ని  టీటీడీ ఎక్క‌డ పుట్టారో ఎలా చెబుతుంద‌ని ప్ర‌శ్నించారు.  క్షేత్ర‌మాసంలో హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించాల‌ని, ఈ నెల‌లో హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు ఎలా నిర్వ‌హిస్తార‌ని ప్ర‌శ్నించారు.  భ‌క్తుల‌ను టీటీడీ మోసం చేస్తోంద‌ని అన్నారు.  పండితుల‌ను అడ‌క్కుండా హ‌నుమ‌త్ జ‌యంతి వేడుక‌ల‌ను ఎలా నిర్వ‌హిస్తార‌ని ప్ర‌శ్నించారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-