ఏపీ హోమ్ శాఖ కీలక నిర్ణయం : వైసీపీ ఎమ్యెల్యేపై 10 క్రిమినల్ కేసులు ఎత్తివేత

ప్రభుత్వ విప్‌, జ‌గ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భానుపై క్రిమినల్ కేసులు ఎత్తివేసింది ఏపీ హోంశాఖ‌. సామినేని ఉదయభాను నిందితుడిగా ఉన్న 10 క్రిమినల్ కేసుల్ని ఎత్తేసింది రాష్ట్ర హోంశాఖ‌. డీజీపీ నుంచి అందిన ప్రతిపాదనల మేర‌కు కేసులు ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్. 10 కేసులపై ప్రస్తుతం విజ‌య‌వాడ‌లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయ‌స్థానంలో కొన‌సాగుతున్న విచారణ… ఆ ప‌ది కేసుల్లో విచార‌ణ‌ను ఉప‌సంహ‌రించుకుంటూ పిటిషన్ దాఖలు చేయించేందుకు చర్యలకు హోంశాఖ ఆదేశించింది. ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌తో న్యాయ‌స్థానంలో పిటిష‌న్ దాఖ‌లు చేయించాల‌ని డీజీపీకి హోంశాఖ ఆదేశించింది. ఉద‌య‌భానుపై వివిధ నేరారోప‌ణ‌ల‌కు సంబంధించి 2015-2019 మ‌ధ్య ఈ క్రిమినల్ కేసులు న‌మోదయ్యాయి. కృష్ణా జిల్లాలోని నందిగామ‌, జ‌గ్గయ్యపేట‌, చిల్లకూరు, వ‌త్సవాయి పోలీసుస్టేష‌న్‌ల ప‌రిధిలో ఈ క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-