వివేకా హత్యకేసుపై ప్రభుత్వాన్ని నిలదీయాలి: చంద్రబాబు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో చంద్రబాబు అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై వ్యూహాం పై చర్చించారు. ముఖ్యంగా వైసీపీ నేతలు చేస్తు న్న పనులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు. టీడీపీ ప్రతిపాదించిన 27 అంశాలపై సభలో చర్చకు పట్టుబట్టాలని చంద్రబాబు అన్నారు.

ఇప్పటికే వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీనిపై ప్రభుత్వాన్ని సభలో గట్టిగా నిలదీయాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలను చర్చించడం కన్నా స్థానిక ఎన్నికల ఫలితాలపైనే ప్రభుత్వం ఆసక్తిగా ఉందని నేతలు అన్నారు. ఈ సారి ఎలాగైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆయన అన్నారు. ఏపీలో జరుగుతున్న అక్రమాలు, రైతులు చేస్తున్న పాద యాత్ర, రాజధాని విషయం తదితర అంశాలపై ఈ సభలో ఎలాగైనా చర్చకు పట్టుపట్టేలా ఎమ్మెల్యేలు వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.

Related Articles

Latest Articles