జూనియర్ కాలేజిలను నడపలేము అంటున్న ప్రిన్సిపాల్స్…

తెలంగాణ విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నేడు ప్రభుత్వ జూనియర్ కాలేజి ల ప్రిన్సిపాల్స్ కలవనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజి లను నడపలేము. ఫ్యాకల్టీ లేక క్లాస్ లు నడవడం లేదు అని ప్రిన్సిపాల్స్ తెలిపారు. కాలేజి ల నుండి పిల్లలు తల్లిదండ్రులు టిసిలు తీసుకొని వెళ్లిపోతామంటున్నారు పదుల సంఖ్యలో కాలేజి లు గెస్ట్ లెక్చరర్ లతో నడుస్తున్నాయి అని తెలిపారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 90 శాతం గెస్ట్ ఫ్యాకల్టీతోనే నడిపిస్తున్నారు. అందుకే మిగితా అన్ని కాలేజిలకు కూడా గెస్ట్ ఫ్యాకల్టీ ని వెంటనే తీసుకోవాలి అని కోరారు. అయితే కరోనా కారణంగా రాష్ట్రంలో ఏడాదిన్నరగా మూసి ఉన్న విద్యాసంస్థలు ఈ నెలలోనే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడిపుడే పాఠశాలలకు వస్తున్న విషయర్థుల సంఖ్య కూడా పెరుగుతుంది.

Related Articles

Latest Articles

-Advertisement-