మోజార్టీ పెరిగిందనే ప్రభుత్వం కౌన్సిల్ రద్దుపై వెనకడుగు: అశోక్‌ బాబు


మోజార్టీ పెరిగిందనే ప్రభుత్వం కౌన్సిల్‌ రద్దు పై వెనుకడుగు వేసిందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆనాడు మెజార్టీ లేదని కౌన్సిల్‌ రద్దు చేస్తా మన్న ప్రభుత్వం , ఈనాడు అధికారపార్టీ మోజార్టీ పెరిగిందని మాట తప్పడం సిగ్గు చేటన్నారు.కౌన్సిల్ రద్దుచేస్తే నష్టపోయేది ప్రభుత్వ మేనని తాము గతంలోనే చెప్పామన్నారు. కౌన్సిల్ రద్దుచేయడం, తిరిగి ఏర్పాటుచేయడమనేది రాష్ట్రాల చేతిలో ఉండదు. పెద్దల సభలో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు చేయాల న్నఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని ఆయన మండిపడ్డారు. కేవలం మూడు రాజధాను ల బిల్లుని తిరిగి ఆమోదించుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఇప్పుడుకౌన్సిల్ అవసరమొచ్చిందన్నారు.

ఈ ప్రభుత్వం ఏంచేయాలనుకున్నా 2023 వరకు ఒకరిద్దరు తప్ప, టీడీపీ బలం కౌన్సిల్‌లో అలానే ఉంటుందన్నారు. ప్రభుత్వం తీసు కునే ప్రజావ్యతిరేక నిర్ణయాలపై టీడీపీ ఎప్పటిలాగానే పోరాడు తుంది దీనిలో ఏ మార్పు ఉండబోదని ఆయన తెలిపారు. ప్రభుత్వం వాహ నాలపై పన్నులుపెంచుతూ తీసుకొచ్చిన బిల్లుని టీడీపీ తీవ్రంగా వ్యతి రేకిస్తోందన్నారు.వాహనాలు, పెట్రోల్ డీజిల్ లపై వచ్చే ఆదాయం చాలదన్నట్లు ఈ ప్రభుత్వం ఏటా రూ.500కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై వేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసే రూ.500 కోట్లతో ప్రభుత్వ దరిద్రం ఏమీ పోదు కదా అంటూ అశోక్‌ బాబు ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.

Related Articles

Latest Articles