ట్రైలర్ అద్దిరిపోయింది అని ప్రభాస్ అన్నాడు : గోపీచంద్

హీరో గోపీచంద్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ‘సీటీమార్’.. గోపీచంద్ కు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ రోజు సీటీమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. ప్రభాస్ నాకు ఫోన్ చేసి ట్రైలర్ అద్దిరిపోయింది అని చెప్పాడు. అయితే ఈ సినిమా 2019 లో ప్రారంభించగా కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా పక్క మాస్, కమర్షియల్ సినిమా. మణిశర్మతో నేను చేసిన సినిమాలో దాదాపు అన్ని హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా అలానే ఉంటుంది అని చెప్పారు. అలాగే ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్స్ గా నటించిన అమ్మాయిలు కూడా చాలా కష్టపడ్డారు అని తెలిపారు. ఇక దర్శకుడు సంపత్ నందికి ఈ సినిమా మీద పూర్తి నమ్మకం ఉంది అని చెప్పారు గోపీచంద్. అయితే ఈ సినిమాలో భూమిక చావ్లా, దిగంగన సూర్యవంశీ కీలక పాత్రల్లో నటిస్తుండగా… సెప్టెంబర్ 10న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది.

Related Articles

Latest Articles

-Advertisement-