గోపీచంద్ ‘సీటీమార్‌’ ట్రైలర్ వచ్చేసింది

హీరో గోపీచంద్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ‘సీటీమార్’.. గోపీచంద్ కు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. భూమిక చావ్లా, దిగంగన సూర్యవంశీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 10న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది. ఈ నేపథ్యంలో ‘సీటీమార్‌’ ట్రైలర్ విడుదల చేశారు. గోపీచంద్ ఆంధ్ర కోచ్ గా, తమన్నా తెలంగాణ కోచ్ గా నటించారు. వీరి మధ్య వచ్చే పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌, యాక్షన్‌ సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తిగా సాగింది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

అయితే ప్రస్తుతం థియేటర్లు తెరచుకున్నప్పటికీ ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలా లేక
ఓటీటీలో విడుదల చేయాలా? అనే సందిగ్ధంలో ఉన్న నిర్మాతలు.. ఎట్టకేలకు సెప్టెంబర్ 10న థియేటర్లోకే వస్తున్నట్లుగా ప్రకటించారు. చాలాకాలం నుంచి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నా గోపీచంద్ కి ఈసారైనా ‘సీటీమార్‌’ కలిసొస్తుందేమో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-