సీటిమార్ సెన్సార్ పూర్తి.. కబడ్డీ కూతకు అంత రెడీ

దర్శకుడు సంపత్‌ నంది తెరకెక్కిస్తున్న ‘సీటీమార్’‌ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంది. యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న థియేటర్లోకి రానుంది. ఈ సినిమాలో గోపీచంద్‌కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా.. దిగంగన సూర్యవంశీలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. భూమిక ముఖ్య పాత్ర పోషిస్తోంది. కాగా, ఇటీవలే విడుదలైన ట్రైలర్ లో గోపీచంద్‌, తమన్నాలు కబడ్డీ కోచ్‌లుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకోన్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో సిల్వర్‌ స్ర్కీన్‌ పతాకంపై శ్రీనివాసా చిత్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

కాగా, గతంలో సంపత్ నంది దర్శకత్వంలో చేసిన ‘గౌతమ్ నందా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించినంతగా ఆడలేకపోయింది. చాలా కాలంగా సక్సెస్ లేని గోపీచంద్ కు ఈ సారైనా హిట్టు కొట్టి సీటీమార్ అనిపిస్తాడో లేదో చూడాలి.

Image

Related Articles

Latest Articles

-Advertisement-