‘సమరసింహారెడ్డి’ టికెట్ల కోసం రెండు రోజులు లాకప్ లో ఉన్నా..

శిల్పకళావేదికలో ‘అఖండ’ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. బోయపాటి- బాలయ్య కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ సివినిమాపై అభిమానూలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిరధ మహారధులు హాజరయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని హాజరయ్యి సందడి చేశారు. ఇక గోపీచంద్ మలినేని మాట్లాడుతూ” బాలయ్య బాబు గురించి చెప్పేటప్పుడు.. ఎన్బీకే అంటే ఒక వైబ్రేషన్, ఎన్బీకే అంటే ఒక మాస్ గాడ్.. నేను ఈ వేడుకకు బాలకృష్ణ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ గా రాలేదు.. మీలో ఒకడిగా, బాలయ్యబాబు అభిమానుల ప్రతినిధిగా వచ్చాను. బాలయ్యబాబుకు నేను పెద్ద ఫ్యాన్ ని.. ‘సమరసింహారెడ్డి’ సినిమా టికెట్ల కోసం ఒంగోలులో రెండు రోజులు లాకప్ లో ఉన్నాను.

బోయపాటి శ్రీను గారు మాస్ పల్స్ తెలిసిన ఒక మాస్ డైరెక్టర్.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’ ఎంతటి విజయాన్ని అందుకున్నాయో .. అఖండ కూడా అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. తమన్ 30 రోజులుగా అఖండ పేరునే కలవరిస్తున్నాడు.. అఖండ అదిరిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు.. అఖండ ఫస్ట్ లుక్ దగ్గరనుంచి టీజర్, ట్రైలర్ చూసాకా ఎంతటి మాస్ చుపించారో అర్థమైంది. శ్రీకాంత్ గారిని విలన్ గా చూశాక.. బాలయ్య గారి పాత్ర ఇంకెంత స్ట్రాంగ్ గా ఉంటుందో ఊహించుకోవచ్చు. కరోనా సెకండ్ వేవ్ తరువాత వస్తున్న ఈ చిత్రం అఖండ విజయం అందుకోవని కోరుకుంటున్నాను” అంటూ పేర్కొన్నారు.

Related Articles

Latest Articles