గోపీచంద్ “అలివేలుమంగ వెంకటరమణ” డౌటే !

మాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో సినిమా రూపొందనుందని కొంతకాలం క్రితం గట్టిగా ప్రచారం జరిగింది. ఈ సినిమాకు “అలివేలుమంగ వెంకటరమణ” అనే టైటిల్ ను ఖరారు చేశారని అన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఊసే లేదు. ప్రస్తుతం గోపీచంద్ “సీటిమార్” విడుదలకు సిద్ధంగా ఉంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా “పక్కా కమర్షియల్” షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే పని పడ్డాడు గోపీచంద్. అటు తేజ గానీ, ఇటు గోపీచంద్ గానీ ఈ ప్రాజెక్ట్ పై అసలు నోరే మెదపట్లేదు. ఇంకేముంది ఈ ప్రాజెక్ట్ కు బ్రేకులు పడ్డాయని ప్రచారం ఊపందుకుంది.

Read Also : సల్మాన్ పై గేమ్… కోర్టు తీర్పుతో భాయ్ కి ఊరట

ఇటీవలి ఇంటర్వ్యూలో గోపీచంద్ దీని గురించి మాట్లాడాడు. ఈ సినిమా డెవలప్మెంట్ గురించి గోపీచంద్‌ని అడగ్గా “మేము ఈ ప్రాజెక్ట్‌లో పని చేయాలని ప్లాన్ చేసిన మాట వాస్తవమే. కానీ అది కార్యరూపం దాల్చలేదు. భవిష్యత్తులో మేము దీనిని చేస్తామో లేదో నాకు తెలియదు” అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు శ్రీవాస్‌తో త్వరలో సినిమా ప్రారంభిస్తానని అంటూ నెక్ట్ ప్రాజెక్ట్ పై కూడా క్లారిటీ ఇచ్చాడు. దీంతో గోపీచంద్ “అలివేలుమంగ వెంకటరమణ” ప్రాజెక్ట్ డౌటే ! అనేది స్పష్టమైంది.

గోపీచంద్ ప్రస్తుతం తన తాజా చిత్రం “సీటీమార్” విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించింది.

Related Articles

Latest Articles

-Advertisement-