వీలైనంత తొందరగా క్రోమ్ బ్రౌజర్ అప్డేట్ చేయండి

గూగుల్ సంస్థ తమ యూజర్ల భద్రతకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. గూగుల్ క్రోమ్ లో హ్యాకర్లు హ్యాక్ చేయడానికి వీలుగా ఒక కొత్త బగ్ ఉన్నట్లు ఇటీవల గుర్తించింది. దీని ద్వారా సైబర్ నేరగాళ్లు ఎక్కడో కూర్చొని కూడా మన ఫోన్ లేదా ల్యాప్ టాప్ లలోని సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ సంస్థ వెల్లడించింది. దీన్ని నివారించేందుకు వెంటనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను వినియోగదారులు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని గూగుల్ పేర్కొంది. లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ లోపాన్ని కవర్ చేయవచ్చని గూగుల్ చెబుతోంది. మీ గూగుల్ క్రోమ్ వెర్షన్ 91.0.4472.164 ఉండాలే చూసుకోవాలని గూగుల్ సంస్థ పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ముందే గుర్తించిన గూగుల్ తన తదుపరి అప్డేట్ ద్వారా ఈ లోపాన్ని సవరించింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-