బుల్లితెర వీక్షకుల మనసు గెలిచిన ‘కొండపొలం’!

ఇవాళ యువ కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ బర్త్ డే! విశేషం ఏమంటే… టాలీవుడ్ డెబ్యూ హీరోల్లో అతని ‘ఉప్పెన’ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. అదే సమయంలో అతని రెండో సినిమా ‘కొండపొలం’ అదే యేడాది విడుదలై, పరాజయం పాలైంది. అయితే వైష్ణవ్ తేజ్ బర్త్ డే సందర్భంగా అతనికో తీపి కబురు అందింది. అదేమంటే… ఈ మూవీని ఇటీవల స్టార్ మా లో ప్రసారం చేసినప్పుడు గౌరవ ప్రదమైన రేటింగ్ ను పొందింది. అర్బన్ ఏరియాలో 12.34 టీఆర్ పీ రాగా అర్బన్ అండ్ రూరల్ కలిపితే 10.54 టీఆర్ పీ పొందింది. చిత్రం ఏమంటే… ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయినా కూడా ఈ టీఆర్ పీని ‘కొండపొలం’ అందుకోవడం గ్రేట్ అంటున్నారు ట్రేడ్ పండిట్స్! ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్‌ దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ సినిమాను నిర్మించారు.

Related Articles

Latest Articles