తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త

ఇంటర్‌ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అక్టోబర్‌ 25 వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఇంటర్‌ పరీక్షలకు కేవల్ 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు ఇస్తామని ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు స్టడీ మెటీరియల్ ను ఇవాళ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్‌ పరీక్షల్లో ఒత్తిడి, భయం లేకుండా ఉండేందుకే ఈ స్టడీ మెటీరియల్ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సారి పరీక్షల్లో 70 శాతం సిలబస్ నుండే ప్రశ్న లు ఇస్తాయని అలాగే 50 శాతం ఛాయిస్ ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. లక్షలాది మంది విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ ఉపయోగపడుతుందని… నిష్ణాతులతో స్టడీ మెటీరియల్ తయారీ చేయించినట్లు చెప్పారు. ఇంటర్ వెబ్సైట్ లో స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటుందన్నారు.

-Advertisement-తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త

Related Articles

Latest Articles