ఏపీ విద్యార్థులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త

ఏపీలో విద్యాకానుక లబ్ధిదారులకు శుభవార్త. వచ్చే ఏడాది నుంచి స్పోర్ట్స్‌ షూతో పాటు స్పోర్ట్స్‌ డ్రస్‌ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాడు-నేడు, ఫౌండేషన్‌ స్కూళ్లపై జరిగిన సమీక్షలో సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం సూచించిన నూతన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం… ఫౌండేషన్‌ స్కూళ్ళ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. నాడు-నేడుపై సమీక్ష జరిపిన సీఎం జగన్‌… రెండో విడతలో 12 వేలకు పైగా స్కూళ్లలో పనులు చేపట్టాలని ఆదేశించారు. రెండో దఫా నాడు నేడు పనుల కోసం టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. అలాగే సీబీఎస్ఈతో పాటు ఐసీఎస్‌ఈ అఫిలియేషన్‌కు సంబంధించి కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులకు సూచించారు. మరోవైపు జగనన్న విద్యాకానుక కింద వచ్చే ఏడాది నుంచి విద్యార్ధులకు స్పోర్ట్స్‌ షూతో పాటు ప్రత్యేక డ్రెస్‌ కూడా పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి డిజైన్‌ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు సీఎం.

Related Articles

Latest Articles

-Advertisement-