ఏపీ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త !

విజయవాడ : త్వరలో జరగనున్న కాటన్ ప్రొక్యూర్మెంట్ విధి విధానాలపై ఉన్నతాధికారులు , సీసీఐ ( కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ) ప్రతినిధులతో మంత్రి కన్నబాబు సమావేశం నిర్వహించారు. నవంబర్ మొదటి వారం నుంచి ప్రత్తి కొనుగోలు ప్రక్రియ మొదలెట్టేందుకు చర్యలు తీసుకుకోవాలని సీఎం ఆదేశించారని ఈ సందర్బంగా పేర్కొన్నారు మంత్రి కన్నబాబు. సీఎం ఆప్ ద్వారా రాష్ట్రంలోని 50 ఎఎంసిలు , 73 జిన్నింగ్ మిల్స్ సీసీఐ ద్వారా కాటన్ ప్రొక్యూర్మెంట్ చేయనున్నామని.. దేశంలో ఎక్కడా లేని విధంగా గత ఏడాది సుమారు రైతుల కోసం రూ 90 లక్షలు ప్రభుత్వం వెచ్చించి ఎఎంసి , జిన్నింగ్ మిల్స్ల నుంచి సీసీఐ వరకూ కాటన్ రవాణా చేయించామని పేర్కొన్నారు. గతేడాది ఎటువంటి సమస్యలు లేకుండా మంచి ధరకు సీసీఐ ద్వారా ప్రత్తిని కొనుగోలు చేయించామని వెల్లడించారు. ప్రత్తి కొనుగులులో ఎఎంసిలు , జిన్నింగ్ మిల్స్ ల వద్ద దళారుల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి కన్నబాబు.

-Advertisement-ఏపీ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త !

Related Articles

Latest Articles