ఏపీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు గుడ్‌న్యూస్..

అమరావతి : ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు పొడిగించాలని జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న 719 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ వారి సేవలను పొడిగిస్తున్నట్టు పేర్కొంది ఏపీ ప్రభుత్వం. జూన్ 2021 నుంచి ఓ పది రోజుల పాటు వారి సేవలకు విరామం ఉంటుందని ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ పేర్కొన్నది.

Read Also : ఆమీర్ ఖాన్ కూతురు ‘సెక్స్ ఎడ్యుకేషన్’ స్టోరీ…

Related Articles

Latest Articles

-Advertisement-