గుడ్ న్యూస్‌: ఇక‌పై ఏటా 20 ల‌క్ష‌ల కొత్త‌ ఉద్యోగాలు…

అమెరికా క‌రోనా నుంచి కోలుకున్నాక మౌళిక స‌దుపాయాల‌ను ఏర్పాటు చేసుకునేందుకును సిద్ధం అవుతున్నది.  దేశంలో మౌళిక వ‌స‌తుల రూప‌క‌ల్ప‌న‌కు రూ.75 ల‌క్ష‌ల కోట్ల రూపాయల బ‌డ్జెట్‌కు సెనెట్‌కు ప్రాథ‌మికంగా ఆమోదం తెలియ‌జేసింది.  దేశంలో మౌళిక వ‌స‌తుల రూప‌క‌ల్ప‌న జ‌రిగితే, అమెరికాలో ద‌శాబ్ద‌కాలం పాటు ఏటా 20 ల‌క్ష‌ల కొత్త ఉద్యోగాలు ల‌భిస్తాయని అధికారులు చెబుతున్నారు.  సెనెట్‌లో ప్ర‌స్తుతం పాథ‌మిక ఆమోదం మాత్ర‌మే పొందింది.  అయితే, దీనికి ఇంకా తుది ఆమోదం ల‌భించాల్సి ఉన్న‌ది.  ప్ర‌స్తుతం సెనెట్‌లో రిపబ్ల‌క‌న్లు-డెమోక్రాట్ల‌కు 50-50 సంఖ్యాబ‌లం ఉన్న‌ది.  తుది ఆమోదం ల‌భించాలంటే క‌నీసం 60 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు అవస‌రం.  ఈ బిల్లును జో బైబెన్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ది.  ఎలాగైనా మ‌ద్ద‌తు పొందాల‌ని చూస్తున్న‌ది.  

Read: ‘జాతి రత్నాలు’ దర్శకుడితో రష్మిక మూవీ

-Advertisement-గుడ్ న్యూస్‌: ఇక‌పై ఏటా 20 ల‌క్ష‌ల కొత్త‌ ఉద్యోగాలు...

Related Articles

Latest Articles