ఒకే రోజు మూడు క్రీడా నేపథ్య చిత్రాలు!

డిసెంబర్ 10వ తేదీ మూడు స్పోర్ట్స్ బేస్డ్ మూవీస్ తెలుగులో విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి నాగశౌర్య ‘లక్ష్య’ కాగా, మరొకటి కీర్తి సురేశ్ నటిస్తున్న ‘గుడ్ లక్ సఖి’. అలానే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మార్షల్ ఆర్ట్స్ మూవీ ‘అమ్మాయి’ కూడా అదే రోజు రాబోతోంది. ‘లక్ష్య’ మూవీలో నాగశౌర్య విలుకాడిగా నటిస్తున్నాడు. అతను పోషిస్తున్న పార్ధు అనే పాత్ర కోసం మేకోవర్ చేయడమే కాదు, విలువిద్యలోనూ శిక్షణ తీసుకున్నాడు. జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్‌ ‘గుడ్ లక్ సఖీ’లో గ్రామీణ యువతిగా నటిస్తోంది. అనేకానేక విషయాలలో ఆమెను దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది, అలాంటి ఓ అమ్మాయి షూటింగ్ నేర్చుకుని అందరినీ తనవైపు ఎలా తిప్పుకుందనే కథాంశంతో ‘గుడ్ లక్ సఖీ’ తెరకెక్కింది.

ఒకే రోజు మూడు క్రీడా నేపథ్య చిత్రాలు!

ఈ సినిమాను సీనియర్ దర్శకుడు నగేశ్ కుకునూర్ తెరకెక్కించగా, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. అలానే ‘లక్ష్య’ సినిమాలో ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్ గా నటించగా, సచిన్ ఖేద్కర్, జగపతిబాబు కీ-రోల్స్ చేశారు. ఇక వర్మ తెరకెక్కించిన ‘అమ్మాయి’ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలైన పూజా భలేకర్ నటిస్తోంది. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, చైనీస్ భాషల్లో విడుదల చేయబోతున్నారు. భారతదేశంలోని ఫస్ట్ రియల్ మార్షల్ ఆర్ట్స్ మూవీ ఇదని వర్మ చెబుతున్నారు. మరి ఈ మూడు క్రీడా నేపథ్య చిత్రాలలో దేనివైపు ప్రేక్షకులు మొగ్గు చూపుతారో చూడాలి.

Related Articles

Latest Articles